Random Video

AP Assembly winter Sessions: పార్ల‌మెంట్ స‌మావేశాల‌తో పాటే ఏపి అసెంబ్లీ స‌మావేశాలు | Oneindia Telugu

2018-11-22 153 Dailymotion

AP assembly winter sessions may start from December first week. Ap govt planning to conduct assembly sessions similar to parliament sessions which starts from December 10th. In this sessions AP council chairman election take place.
#parliamentsessions
#APassembly
#wintersessions
#Apgovt


ఏపి శాస‌న‌స‌భా శీతాకాల స‌మావేశాలకు ముహూర్తం ఖ‌రారైంది. పార్ల‌మెంట్ స‌మావేశాల‌తో పాటుగానే ఏపి అసెంబ్లీ స‌మా వేశాల‌ను నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ స్థానాన్ని ఇదే స‌మా వేశాల్లో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే మండ‌లి ఛైర్మ‌న్ గా ష‌రీఫ్ పేరును ఖ‌రారు చేసారు. కాగా, డిసెంబ‌ర్ 11న అయిదు రాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాలు రానున్నాయి. అదే స‌మ‌యంలో స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. కేంద్రం పై అస్త్రాను మ‌రింత‌గా ఎక్కుపెట్ట‌టానికి శాస‌న‌స‌భ‌ను వేదిక‌గా మ‌ల‌చుకొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌తిప‌క్షం వైసిపి ఈ స‌మావేశాల‌కు హాజ ర‌య్యే ఛాన్స్ క‌నిపించ‌టం లేదు. ఒక వైపు అయిదు రాష్ట్రఆల ఎన్నిక‌లు..మ‌రో వైపు ఏపిలో వేడెక్కిన రాజ‌కీయ ప‌రిస్థితుల న‌డుమ ఏపి అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబ‌ర్ ప‌దో తేదీ నుండి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల స‌మ‌యంలోనూ ఏపి లోనూ అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందు కోసం ఏర్పాట్లు చేయాల‌ని స్పీక‌ర్ సి బ్బందిని ఆదేశించారు. దాదాపు ప‌ది రోజుల పాటు స‌మావేశాలు జ‌రిగే అవ‌కాశం ఉంది. స‌మావేశాల తొలి రోజున ఇటీవ‌ల మావోయిస్టుల కాల్పుల్లో మ‌ర‌ణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు కు స‌భ నివాళి అర్పించ‌నుంది.